౩-ఉదాహరణలు.----------౧.గుంతకల్ లో ఒకరు పూజ చేయించిన విప్రునికి ౧౨౦౦/రూపాయలు బాకీ పెట్టారు.దీని ఫలితంగా వారి అమ్మాయికి గత ౬ మాసాలుగా సంభందాలు తప్పిపోతూవస్త్తున్నాయి.కారణం దక్షిణలోని లోపాలు తప్పించి వేరు కారణాలు కాదు.ఆ విప్రుడు వారికి ఈ విషయాన్ని ముందుగానే చెప్పినా ,వారు ఆ ఇవన్ని జరిగినపుడు చూద్దాంలే అన్కోవడం ..ఇపుడు దాని తాలుకూ ఫల్లాని అనుభవించడం జరుగుతోంది మరి .నిన్నకూడా వారు నాతో ఈ విషయం గురుంచి చెప్పినపుడు,నేను వారిని సమర్ధించలేదు.వైద్యం/మతం వంటి విషయాల్లో నమ్మకం ప్రధానం.ఈ పూజను ఆ పిల్లకు తొందరగా వివాహం కావాలని చేయిన్చినదే కావడం గమనిచదగినది.
౨.హైదరాబాద్లో ఒక కుటుంబం మొత్తం కన్యా/దంపతుల శాపానికి గురై గత ఏళ్ళు గా ,ఆ ఇంటిలోనివారంతా సంసార సుఖానికి నోచుకోక తల్లడిల్లు తున్నారు.వారికి సమస్యనుంచి బయటపడాలనే ఉన్నా ,సొంత తెలివి/అపనమ్మకం/డబ్బు కర్చు ఉండరాదనే ఒక అజ్ఞానం వల్ల ,చెప్పిన రోజు కాక,వారికి తీరిక దొరికిన రోజున పరిహారం జరిపారు కాని విప్రులు సూచించిన వస్తు సామాగ్రిని వాడకుండా చేశారు.పరిహారం చెప్పిన విప్రునికి మొహం చాటువేసారు.ఇందువల్ల వారు ఇంకా భాధలు పడాల్సి ఉంటుందని వారు గ్రహించడంలేదు.పరిహారం చెప్పిన విప్రుడు వారికి ఫోన్ చేయగా ఈ అసలు విషయం వెలుగును చూసింది.పోనీ వారు లేనివారేమి కాదు.ఇపుడు వారు ఈ విషయంలో ఆందోళన చెందుతున్నారు.ఫలితం ఒకటికి రెండు పనులు అయ్యాయి మరి.
౩.ఒకరు కాశిలో రుణ[పండితులు ముందుగానే ఈ విషయం ను సదరు పార్టీకి చెప్పినప్పటికిని వారు అలానే చేయడం శోచనీయం.]-విమోచన అంగారక వ్రతం చేయించారు,అయితే దక్షిణను నెలరోజుల ఆలస్యంగా అందచేయడంతో సమస్య అలాగే ఉంది. చదవడానికి ఇవి కధలుగానే ఉన్నా వాస్తవాలు.
దయచేసి పరిహారాలను వాయిదాల రూపంలో దక్షినలను ఇస్ట్టూ మాత్రం చేయకండి.ఎందుకంటే వాటికి పలం కనిపించదుకనుక.ఈ వంకతో వాటిని చేయించిన విప్రులను ఆడిపోసుకోకండి.అది మరో పాపం కింద పరిణమిస్త్తుంది మరి. అదే విధంగా సరియిన పండితుల వద్దే పరిహార మార్గాలను అన్వేషించండి.
Monday, July 5, 2010
Sunday, July 4, 2010
జ్యోతిష్యం-౩
అలస్యమ్ గా దక్షిణను ఇస్త్తే ?---------ముహుర్తకాలం[౪౮-నిముషాలు]లో విప్రులకు దక్షిణ ఇవ్వడం వలన చేసిన పూజ/వ్రతం/కర్మలకు వెంటనే ఫలం లభిస్తుంది.౧౨గ౦:లు దాటిన పిదప ఇది ౬రెత్లు/౭౨గ౦:లుఐతఎ ౧౦/౭రొజులు-౨౦/ఒక నెలకి లక్ష/౧౨నెల్లకి ౩కొట్లు రెట్లు పెరుగుతుంది.అంటే ఆలస్యం ఐనకొద్దీ దక్షిణ విలువ పెరుగుతుందని గ్రహించాలి.ఎంత ఆలస్యం ఐతే అంతే ఆలస్యంగా ఫలం లభిస్తుంది .ఒక ఏడాది ఆలస్యం పిదప మనం ఎన్ని రెట్లు ధనమిచ్చినా ఫలం కలగదు.యజమాని చేసినదంతా వ్యర్ధమే.విప్రులకు ఇవ్వాల్సిన సొమ్మును ఇవ్వకుంటే దరిద్రం/రోగాలు/పాపాలు సంక్రమిస్త్తాయి .ఇటువంటి ఎగవేతదారు ఇచ్చే స్రాద్ధ్హ/పితృ/పూజలను ,అగ్ని,ఆహుతులను దేవతలు స్వీకరించరు.ఇస్త్తానని చెప్పిన దక్షిణ దాతా,దాని గురించితిరిగి అడగని గ్రహీత లు ఇద్దరూ నరకగ్రస్తులు అవుతారు.విప్రుడు తనకు ఇవ్వాల్సిన దక్షిణను అడిగినా ఇవ్వని వాడు 'కుంభీపాక"నరకంలో లక్ష ఏళ్లు ఉంటాడు.దక్షిణ ఎగవేసివాడు తన ౭ తరాలను పాపకూపంలోకి నేడతాడు. ................../దక్షిణలేని కర్మఫలం ఎవరికీ చెందుతుంది?------- వామనుడు దక్షిణ లేని ఫలాన్ని బలి కి ధారాదత్తం చేసారని "వామన పురాణంలో ఉన్నది. ఇందుకుగాను నావద్ద ౨౦౦౯ లో జరిగిన ౨ /౨౦౧౦ మే లో జరిగిన ౧ ద్రుస్టాన్తరాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను.వీటిని నా తదుపరి పోస్ట్లో వివరిస్తాను.
జ్యోతిష్యం-౨
బ్రహ్మవ్య్వర్తన పురాణం-ప్రకృతి ఖండంలో చెప్పబడిన "దక్షిణాదేవి"కధ ఇది----[చూ-౪౨]గోలోకంలోని రాధకు సుశీల అనే గోపిక నేచ్చేలిగా ఉండేది.ఒకరోజు ఆమెకృష్ణునికి దక్షిణ భాగంలో ఆసీనురాలై ఉండటం చూసిన రాధ కోపగించి శాపం ఇచింది.ఇందువల్ల ఆమె భువిపి జన్మించి ,దక్షిణ పేరుతో ప్రసిద్దురాలైంది.[కర్మిస్త్తుల కర్మల సంపూర్తికోసం ఈశ్వరుడు..స్వాహా/స్వధా/దక్షినలను సృజించాడని ఈ పురాణంలోని ౪౧ వ ప్రకరణం చెబుతున్నది.ఈ ముగ్గురిలో స్వదను పిత్రుగానాలకు/స్వాహాను మర్త్యులు ,రక్కసులుకు/ దక్షినాదేవిని సర్వలోక హిత౦ కోసంకోసం విప్రులకు బ్రహ్మ నియమించాడు.]భూమిని చేరిన దక్షిణా చిరకాల తపంతో లక్ష్మీదేవిలో లీనమైంది.ఇది జరిగినకొడ్డి కాలానికి దేవతలు యగ్నంచేసి ,దాని ఫలాన్ని పొందలేక బ్రహ్మ్మాను సలహా అడగ్గా ఆయన లక్ష్మిని అర్ధించి ఆమె శరీరంలో దాగిన దక్షిణను,యజ్నపురుశునికి భార్యగా ఇచ్చాడు.ఈ దంపతులకు పుట్టిన సంతానమే "దక్షినాయజ్నుడు".ఇతడు ప్రసన్నం కావాలంటే కర్మలాచరించిన వారు ,వెంటనే కర్మకాండను చేయించిన విప్రులకు దక్షిణను ఇవ్వాలి.దక్షిణను ఇవ్వడం ఎంత ఆలస్యంగైస్స్తే..అంత ఆలస్యంగా ఫలితం లభిస్త్తుందని తెలుసుకోవాలి [ఇది పురాణంలో చెప్పిన హెచ్చరిక].
Monday, June 7, 2010
జ్యోతిష్యం
పరిహారక్రియలు ఫలిన్చాలీఅంటే ఏమీ చేయాలి ?ఎలా చేయాలి ?
మనలో పలువురికి జ్యోతిష్కులు సూచించే పరిహరక్రియలపట్ల కొంత చిన్న చూపు ,చెప్పినవారిఫై సందేహాలు సర్వసాధారణంగా కల్గుతున్టాయ్.కాని జ్యోతిష్కుడు చెప్పినట్టుగా చేయకపోవడం,వారికి అనువైన రోజున క్రియలను జరపడం,అలానే ఎందుకు,ఇలా చేయకూడదా అనే పంధాలో నడవడం ,సమయం లేదనే వంకలతో తంతును షార్ట్-కట్
పద్ధతిలో ముగించడం,ఇవాలిసిన సమయానికి తంతు జరిపించినవారికి గౌరవంగా దక్షిణలు అందచేయకపోవడం,తంతుల్లో వాడమని చెప్పిన వస్తువులను దొరకలేదనో,సమయం,డబ్బు దొరకలేదనో చెప్పి వాడకపోవడం వంటి పలు కారణాలు ,పరిహరక్రియలు విఫలం కావడానికి ప్రధాన అంశాలుగా నిలుస్తున్నై.అసలు దక్షిణలకోసమే జ్యోతిష్కులు వీటిని సూచిస్త్తారనే అపవాదు కూడా చాలా ప్రబలంగా ప్రజలలో ఉండటం విచారకరం.అసలు దక్షిణలు ఎందుకు?అనే వారికోసం బ్రమ్హవైవర్తనపురానం-ప్రకృతి ఖండంలో ఒక కథ ఉన్నది.అదేమిటో తెలుసుకుందాం.
దక్షిణాదేవి చరిత్ర ===
Sunday, June 6, 2010
Subscribe to:
Posts (Atom)