Sunday, July 4, 2010
జ్యోతిష్యం-౨
బ్రహ్మవ్య్వర్తన పురాణం-ప్రకృతి ఖండంలో చెప్పబడిన "దక్షిణాదేవి"కధ ఇది----[చూ-౪౨]గోలోకంలోని రాధకు సుశీల అనే గోపిక నేచ్చేలిగా ఉండేది.ఒకరోజు ఆమెకృష్ణునికి దక్షిణ భాగంలో ఆసీనురాలై ఉండటం చూసిన రాధ కోపగించి శాపం ఇచింది.ఇందువల్ల ఆమె భువిపి జన్మించి ,దక్షిణ పేరుతో ప్రసిద్దురాలైంది.[కర్మిస్త్తుల కర్మల సంపూర్తికోసం ఈశ్వరుడు..స్వాహా/స్వధా/దక్షినలను సృజించాడని ఈ పురాణంలోని ౪౧ వ ప్రకరణం చెబుతున్నది.ఈ ముగ్గురిలో స్వదను పిత్రుగానాలకు/స్వాహాను మర్త్యులు ,రక్కసులుకు/ దక్షినాదేవిని సర్వలోక హిత౦ కోసంకోసం విప్రులకు బ్రహ్మ నియమించాడు.]భూమిని చేరిన దక్షిణా చిరకాల తపంతో లక్ష్మీదేవిలో లీనమైంది.ఇది జరిగినకొడ్డి కాలానికి దేవతలు యగ్నంచేసి ,దాని ఫలాన్ని పొందలేక బ్రహ్మ్మాను సలహా అడగ్గా ఆయన లక్ష్మిని అర్ధించి ఆమె శరీరంలో దాగిన దక్షిణను,యజ్నపురుశునికి భార్యగా ఇచ్చాడు.ఈ దంపతులకు పుట్టిన సంతానమే "దక్షినాయజ్నుడు".ఇతడు ప్రసన్నం కావాలంటే కర్మలాచరించిన వారు ,వెంటనే కర్మకాండను చేయించిన విప్రులకు దక్షిణను ఇవ్వాలి.దక్షిణను ఇవ్వడం ఎంత ఆలస్యంగైస్స్తే..అంత ఆలస్యంగా ఫలితం లభిస్త్తుందని తెలుసుకోవాలి [ఇది పురాణంలో చెప్పిన హెచ్చరిక].
Subscribe to:
Post Comments (Atom)
డియర్ సర్! మీరు తరచూ నా బ్లాగును సందర్శించి స్పందిస్తుండటం నాకెంతో సంతోషంగా వుంది. ప్రస్తుతం నేను హైదరాబాద్ లో వున్నా... నేను సైతం చెన్నైవాడినే. వల్సరవాకంలో వుండి ఇక్కడకు వచ్చాను. నా నెంబర్ 09985444486. నా పేరు ఆది. నేను కూడా మీడియాకు చెందిన వాడినే. ఫోన్ చేస్తే మరిన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు. ఏమంటారు. నమస్తే ఇట్లు ఆది.
ReplyDelete